ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నిర్మాతలలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇప్పటికే చాలా సినిమాలను నిర్మించాడు. ఈయన నిర్మించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈయన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చాలా సినిమాలను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా ఈ నిర్మాత విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ ని కూడా రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాకు మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. తాజాగా సూర్య దేవర నాగ వంశీ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. నాగ వంశీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ VD 12 సినిమా అద్భుతంగా ఉండబోతుంది.

గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కోసం చాలా పెద్ద స్టోరీ రాసుకున్నాడు. అది ఒక పార్టీలో పూర్తి కాదు. కచ్చితంగా దానిని రెండు పార్ట్ లుగా తీయవలసిందే. అందుకోసం మేము కూర్చొని మొదటి పార్ట్ ఎండింగ్ లో అద్భుతమైన ట్విస్ట్ ను ఒక దానిని పెట్టాం. దానితో రెండవ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం మొదటి భాగం చిత్రీకరణను షూట్ చేస్తున్నాము. సినిమా విడుదల అయిన తర్వాత రెండవ భాగం షూటింగ్ ను ప్రారంభిస్తాము అని నాగ వంశీ తాజాగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: