యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అయినటువంటి నార్ని నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మ్యాడ్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా నితిన్ కు కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. మ్యాడ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ని రూపొందిస్తున్నారు. ఇకపోతే తాజాగా నితిన్ "ఆయ్" అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ ని బన్నీ వాసు నిర్మించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నితిన్ అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఆ ఇంటర్వ్యూలో భాగంగా అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నితిన్ మొదటి సినిమా ప్రస్తావన వచ్చింది. దానికి ఈయన సమాధానం ఇచ్చాడు.

అసలు విషయం లోకి వెళితే ... నితిన్ మొదటగా మ్యాడ్ అనే మూవీ ని కాకుండా శతమానం భవతి సినిమా దర్శకుడు అయినటువంటి సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా నితిన్ మాట్లాడుతూ... ఆ సినిమా ఆగిపోయింది. అనుకున్నట్లుగా ఆ ప్రాజెక్ట్ రాలేదు. అందుకే దానిని ఆపేసం. అది ఇక రాదు అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ మూవీ పూర్తి అయ్యింది. మరికొంత కాలం లోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం అని కూడా అప్పట్లో ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి న్యూస్ రాలేదు. తాజాగా ఆ సినిమా బాగా రాలేదు. దానిని విడుదల చేయడం లేదు అని నితిన్ ప్రకటించడంతో చాలా మంది షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: