తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు. దిల్ రాజు ఇప్పటివరకు తన కెరియర్ లో ఎంతో మంది కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు. ఈయన నిర్మించిన సినిమాలతో దర్శకులుగా కెరియర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్లుగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన భద్ర మూవీ తోనే బోయపాటి శ్రీను కూడా దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు.

రవితేజ హీరో గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా బోయపాటి శ్రీను కు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమా చేసినందుకుగాను బోయపాటి శ్రీను కి దిల్ రాజు కొంత మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా ఇచ్చాడట. ఇక ఆ తర్వాత ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి సంబంధించిన కొన్ని భాషల రీమేక్ హక్కులను కూడా దిల్ రాజు కొంత ధరకు అమ్ముకున్నాడట.

దీనితో బోయపాటి శ్రీను ... సార్ ఇది నా కథ ... మీరు ఎలా అమ్ముతారు అనే అడిగాడట. దానితో దిల్ రాజు , శ్రీను "భద్ర" నీ మొదటి సినిమా. నేను అదే సమయంలో నీ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులు నాకే కావాలి. నువ్వు సినిమా తీసి వెళ్లిపో ... నీకు ఇంత ఇస్తాను అని అగ్రిమెంట్ చేసుకుంటే దానిపై నువ్వు సంతకం పెట్టే వాడివా లేదా అని అన్నాడట. దానితో బోయపాటి శ్రీను పెట్టేవాడిని సార్ అన్నాడట. ఓకే ... అందుకే నేను ఇప్పుడు ఆ సినిమా రైట్స్ ను అమ్ముతున్నాను. నీకు డబ్బులు కావాలి అంటే చెప్పు నేను ఇస్తాను అన్నాడట. దానితో బోయపాటి శ్రీను అవసరం లేదు సార్ అని అన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: