తెలుగు సినీ పరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అద్భుతమైన స్థాయికి చేరిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవికి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో విలన్ పాత్రలో నటించాడు. ఇక విలన్ పాత్రల్లో కూడా చిరంజీవి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి తన కెరియర్ ప్రారంభంలో ఎన్ని సినిమాలలో విలన్ పాత్రలల్ నటించాడు  అనే విషయాన్ని తెలుసుకుందాం.

చిరంజీవి ... కమల్ హాసన్ హీరోగా జయసుధ హీరోయిన్ గా రూపొందిన ఇది కథ కాదు సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా రూపొందిన మోసగాడు అనే సినిమాలో కూడా చిరంజీవి విలన్ గా నటించాడు. ఈ మూవీ తర్వాత 47 రోజులు అనే సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత న్యాయం కావాలి , తెలుగు లేని మనిషి చిత్రాల్లో కూడా చిరంజీవి విలన్ పాత్రల్లో నటించాడు. ఇలా కెరియర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో చిరంజీవి చాలా సినిమాల్లో విలన్ పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇక విలన్ పాత్రల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. హీరోగా కూడా చిరు నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి. ఇక చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో చిరు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ఇక ప్రస్తుతం కూడా చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: