2002లో మాక్డి అనే చిత్రంతో మొదటిసారిగా బాలీవుడ్లోకి చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తన కెరీర్ ని మొదలు పెట్టింది శ్వేతా బసు ప్రసాద్.. ఆ తర్వాత టీవీ షో లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారులోకం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల కలల రాణిగా కూడా పేరు సంపాదించింది.
ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్న సమయంలో హైదరాబాదులో సెక్స్ రాకెట్లు పట్టు పడడంతో ఒకసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. 2014లో ఈమని సెక్స్ రాకెట్ కింద పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కొన్ని నెలల పాటు రెస్క్యూ హోం లో కూడా ఈమెను తరలించారు.. ఆ తర్వాత బయటికి వచ్చిన శ్వేతా బసు ప్రసాద్.. అసలు విషయాన్ని చెప్పింది.ఒక ఈవెంట్ కోసం హైదరాబాద్కు వెళ్ళినప్పుడు తనపైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. ఆ తర్వాత పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. మంచి స్టార్డం ఉన్న ఈ ముద్దుగుమ్మ కి సెక్స్ రాకెట్ లో చిక్కుకోవడంతో ఈమె కెరియర్ కు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉన్నది శ్వేతా బసు ప్రసాద్.