ఆమె తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది. అలా ఈ ముద్దుగుమ్మ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ అందుకుంటుంది అయితే కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా ని గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ సిద్ధార్థ్ మల్హోత్రా కంటే ముందే అంబానీ ఇంటికి కియారా అద్వానీ కోడలుగా వెళ్లేదట.మరి ఆ అవకాశాన్ని ఎలా చేజార్చుకుందో ఇప్పుడు చూద్దాం.. అంబానీ ఫ్యామిలీ లాగే కియారా తండ్రి జగదీప్ అద్వాని కూడా పెద్ద బిజినెస్ మాన్. అలా ఇద్దరు బిజినెస్ మాన్ లు కావడంతో వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆ సాన్నిహిత్యం కేవలం తండ్రుల మధ్య కాదు కుటుంబం మధ్య కూడా ఉండేదట. అలా చిన్నతనంలో కియారా అద్వాని,ముకేశ్ అంబానీ పిల్లలు చదువుకునే ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లోనే వారితో చదువుకుందట.
ఆ సమయంలో ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీతో కియారా అద్వానికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేదట. ఈ ఫ్రెండ్షిప్ కాస్త పెరిగి పెద్దయ్యాక ప్రేమగా మారి ఇద్దరు చాలా రోజులు డేటింగ్ చేశారట. కానీ అదే సమయంలో ఆకాష్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్నారట. కానీ కియారా అద్వాని మాత్రం చదువులు మానేసి మోడలింగ్ వైపు అడుగులు వేసి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయింది.అయితే ఈ విషయం నచ్చని ఆకాష్ అంబానీ వద్దని చెప్పినా కూడా కియారా వినకుండా తన కల తను నెరవేర్చుకోవాలి అని సినిమాల్లోకి వచ్చింది. అలా ఆకాష్ అంబానీ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోతే కియారా మాత్రం సినిమాల మీద ఇష్టంతో సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది.
అలా ఇద్దరికి బ్రేకప్ జరిగింది. ఇక చివరికి ముకేశ్ అంబానీ తన కొడుకు ఆకాష్ అంబానికి శ్లోకా మెహతా తో పెళ్లి జరిగింది. అయితే కియారా అద్వానీ గనుక సినిమాల్లోకి రాకుండా ఆకాష్ అంబానీతో పై చదువుల కోసం విదేశాలకు వెళ్తే కచ్చితంగా ఈ జంట పెళ్లి చేసుకునేదని, కానీ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కియారా అద్వాని చదువుని పక్కనపెట్టి సినిమాల్లోకి వచ్చి ఆకాష్ మాట వినలేదని,ఒకవేళ వినుంటే అంబానీ వంటి బడా ఫ్యామిలీలోకి కియారా అద్వానీ కోడలుగా వెళ్లేదని తెలుస్తోంది.