ఏకంగా 11 మంది కొత్తవాళ్లతో యదు వంశీ అనే దర్శకుడు కమిటీ కుర్రాళ్ళు అనే ఒక సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మెగా డాటర్ నాగబాబు కూతురు అయినటువంటి నిహారిక నిర్మించింది. ఈ మూవీ విడుదలకు ముందు నుండే నిహారిక ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉంది. దానితో ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 9 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇక సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది భావించారు. కాకపోతే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ కి ఒక సమస్య ఎదురయింది. ఆ సమస్య కొత్త సినిమా వల్ల కాదు. రీ రిలీస్ మూవీ ద్వారా. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మురారి మూవీ విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మే 9 వ తేదీన థియేటర్లలో రీ రిలీస్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దానితో కమిటీ కుర్రాళ్ళు సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన కూడా మురారి సినిమా ఎఫెక్ట్ ఈ మూవీ కలెక్షన్ లపై పడుతుంది. మరి ఏ సినిమాకు అయినా మొదటి వీకెండ్ ఎంతో ముఖ్యమైనది. అందులో మురారి సినిమా ఎఫెక్ట్ కమిటీ కుర్రాళ్ల మూవీపై పడితే ఈ సినిమా కలెక్షన్లపై పెద్ద ప్రభావం పడే అవకాశం చాలా వరకు ఉంది మరి కమిటీ కుర్రాళ్ళు మురారి సినిమాను తట్టుకొని ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: