తెలుగు సినీ పరిశ్రమలో హీరోలుగా కొనసాగుతున్న వారిలో మంచి స్టోరీ సెలక్షన్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన స్టోరీ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది కాబట్టే ఇప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే చిరంజీవి స్టోరీస్ సెలక్షన్ విషయంలో అద్భుతం అని ఒక సినిమా విషయంలో మరోసారి క్లియర్ గా బయటపడింది. అసలు సినిమా ఏమిటి ..? అసలు స్టోరీ ఏమిటి అనేది తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం నాగ చైతన్య హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు "జోష్" అనే మూవీ ని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. 

సినిమా ద్వారానే నాగ చైతన్య వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని సాధించింది. ఇక దిల్ రాజు ఓ సందర్భంలో మాట్లాడుతూ ... వాసు వర్మ "జోష్" సినిమా కథను నాకు వినిపించినప్పుడు ఇది రామ్ చరణ్ తో బాగుంటుంది అని నాకు అనిపించింది. దానితో చరణ్ కు ఈ కథను వినిపించాను. ఆయనకు ఆ కథ బాగానే నచ్చింది. కానీ చిరంజీవి గారికి ఆ కథను వినిపించండి అని అన్నాడు. దానితో చిరంజీవి గారికి కథను వినిపించి వచ్చేసాము.

ఆయన ఒక రోజు ఫోన్ చేసి రాజు సినిమా కథ బాగానే ఉంది. కాకపోతే చరణ్ పై అది వర్కౌట్ కాదు. వేరే వాళ్ళతో తీసుకోండి అది మీ ఛాయిస్ అన్నాడు. ఇక ఆ తర్వాత నాగార్జున గారికి కథ చెప్పడం , ఆయనకు నచ్చడంతో నాగ చైతన్య తో ఆ సినిమా చేశాం. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక చిరంజీవి గారి స్టోరీస్ సెలక్షన్ సూపర్. ఎందుకు అంటే ఆ సినిమా కథ విన్న వారెంతో మంది ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారు. నేను కూడా అదే నమ్మాను. కానీ చివరికి చిరంజీవి గారు అన్నట్లే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆయన స్టోరీ సెలక్షన్ అద్భుతం అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: