అద్భుతమైన టాలెంట్ కలిగిన నటులలో విక్రమ్ ఒకరు. ఈయన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది. దానిని నిరూపించుకోవడానికి విక్రమ్ ఎంత వరకు అయినా వెళుతూ ఉంటాడు. సినిమాలో ఆయన పాత్ర కోసం ఏదైనా చేయడానికి విక్రమ్ వినకాడడు. అలా ఆయన తన పాత్ర కోసం ఏదైనా చేయడానికి వెనకాటుడు కాబట్టే ఈయన నటనకు ఎంతో మంది ప్రత్యేక విలువను ఇస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విక్రమ్ ఆరితేరాడు కానీ అద్భుతమైన స్టోరీలను ఎంచుకోవడంలో మాత్రం విక్రమ్ వెనకబడే ఉన్నాడు. దానితో ఈయనకు ఎప్పుడో వచ్చిన అపరిచితుడు తర్వాత ఆ స్థాయి విజయం ఇప్పటివరకు దక్కలేదు.

వరుసగా సినిమాలు చేస్తున్న భారీ సక్సెస్ మాత్రం విక్రమ్ కి దక్కడం  లేదు. తాజాగా విక్రమ్ తంగాలన్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా సినిమాగా తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. విక్రమ్ కి తమిళ్ తర్వాత మంచి మార్కెట్ ఉంది తెలుగు లోనే. కానీ అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా ఈయనకు ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ఎందుకు అంటే కొంత కాలం క్రితం తమిళ్ లో ధనుష్ హీరోగా రూపొందిన రాయన్ అనే సినిమా విడుదల అయింది. ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

ఇప్పటికి కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను తమిళనాడులో రాబడుతుంది. దానితో తాగాలన్ సినిమాకు ఈ సినిమా తమిళనాడులో కాంపిటేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇటు చూస్తే ఆగస్టు 15 వ తేదీన తెలుగు లో డబల్ ఈస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ , ఆయ్ సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే ఈ వారం తెలుగు లో విడుదల అయిన కమిటీ కుర్రాళ్ళు సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కాబట్టి ఈ సినిమా జోరు రెండవ భారం కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. దానితో విక్రమ్ కు మంచి గుర్తింపు ఉన్న ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఈయనకు కాస్త గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ రెండు ప్రాంతాలలో కూడా విక్రమ్ తంగలాన్ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: