- రీ రిలీజ్ లో రెండు రోజుల్లోనే రు 7.4 కోట్ల వసూళ్లు
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా వాస్తవానికి మహేస్ బాబు రేంజ్‌కు తగ్గ సినిమా అయితే కాదు. గుంటూరు కారం వాస్తవానికి ప్లాప్ టాక్ ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ ఇలాంటి సినిమా తీశాడేంట్రా బాబు అని మహేస్ ఫ్యాన్స్ సైతం తలలు పట్టుకున్నారు. అలాంటి ది ఆ సినిమా యే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపేసింది.
ఇక మహేష్ స్టామినా ఏంటో మరోసారి ఫ్రూవ్ చేసింది మురారి రీ రిలీజ్. ఎప్పుడో 2001లో మహేష్ బాబు - కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన మురారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. హైదరాబాద్ లో అయితే ఈ సినిమా డైరెక్టుగా 4 ఆటలతో ఏకంగా 225 రోజులు కూడా ఆడింది. ఇక ఇన్నేళ్లకు ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే అదిరిపోయే క్రేజ్ తో దూసుకు పోతోంది.
తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన మళ్ళీ థియేటర్ల లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తూ దూసుకు పోతోంది. మురారీ రీ రిలీజ్ లో కేవలం రెండు రోజుల్లోనే 7.4 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆదివారం కూడా ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తాయని అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా, లక్ష్మీ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.