మెగా ఫాన్స్ అనేవారు మెగా ఫ్యామిలీ పట్ల ఎటువంటి విధేయత చూపిస్తారు అనేది అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే మనవాళ్లు పడి చస్తారు. చిరంజీవి సినిమా కెరీర్లో ఇంద్ర సినిమా అనేది చాలా ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే మైలురాయిగా మిగిలింది. ఇప్పుడు ఇదే సినిమా విషయమై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

విషయం ఏంటంటే.... అప్పట్లో ఇంద్ర సినిమాని వైజయంతి మూవీస్ పతాకం పైన అశ్విని దత్ ఇంద్ర సినిమాని రూపొందించడం జరిగినది. కాగా అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. అయితే ఈ మధ్యకాలంలో రి రిలీజ్ ట్రెండ్ మొదలవడంతో... అశ్విని దత్ ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి బర్త్డేని పురస్కరించుకొని రిలీజ్ చేస్తామని గత నెలలో ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇంకో పది రోజులలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి.. ఈ తరుణంలో మెగా ఫ్యాన్స్.. " అసలు ఇంద్ర సినిమా రీ రిలీజ్ చేస్తున్నారా దత్తు గారు? " అంటూ సోషల్ మీడియాలో వైజయంతి మూవీస్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో విషయం లేకపోలేదు!

దాదాపు నెల రోజుల క్రితం ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చిన దత్తు గారు.. ఆ తరువాత పత్తా లేకుండా పోయారు. చిరు బర్త్డేకి ఇంకా జస్ట్ 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ, వైజయంతి మూవీస్ వారి నుండి ఎటువంటి రిప్లై రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైజయంతి మూవీస్ బ్యానర్ ని ట్యాగ్ చేస్తూ పై విధంగా స్పందిస్తున్నారు. 2002లో అశ్విని దత్ నిర్మాణ సారధ్యంలో, బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని మెగాస్టార్ చిరంజీవి చేసిన డాన్స్ కు అప్పటి యువత పిచ్చెక్కిపోయింది. ఇక మాస్ సర్కిల్స్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న ఇమేజ్ గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వారే ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: