ప్రభాస్ అవకాశం ఇస్తే ఏ హీరోయినైనా సరే ఎగిరి గంతులు వేయాల్సిందే. ఎందుకంటే ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. కల్కి సినిమా విడుదల కాకముందు వరకు ప్రభాస్ బాహుబలి సినిమా పేరు చెప్పుకొని ఇప్పటివరకు రాణిస్తున్నాడని ఆయన చేసిన సినిమాలు ఇక ఫ్లాపే అంటూ ఆయనపై చాలా నెగెటివిటీ ప్రచారం చేసారు.కానీ సలార్ సినిమాతో నెగెటివిటీ కాస్త పోయింది. ఇక కల్కి సినిమాతో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ కింగ్ గా అని చెప్పుకోవచ్చు.అయితే అలాంటి ఈ హీరో తన సినిమాలో అవకాశం ఇస్తే హీరోయిన్ వద్దని వెళ్లిపోయిందట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు కీర్తి సురేష్.. ప్రభాస్ కీర్తి సురేష్ కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఏంటి.. కీర్తి సురేష్ ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్ తన సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోలేదు.ఒక పాత్ర కోసం చిత్ర యూనిట్ కీర్తి సురేష్ ని సంప్రదించారట. ఇక విషయం ఏమిటంటే..నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898  AD మూవీలో ప్రభాస్ హీరోగా చేస్తే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో కమల్ హాసన్ విలన్ గా చేశారు.అలాగే దీపికా పదుకొనే ఇందులో మెయిన్ హీరోయిన్ గా చేసింది.అంతేకాకుండా దిశా పటాని, సీనియర్ నటి శోభన,రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, రాజమౌళి,ఆర్జీవి,అనుదీప్ ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే ప్రభాస్ కార్ కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది.ఈ వాయిస్ ఓవర్ ఇవ్వకముందే నాగ్ అశ్విన్ ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం కీర్తి సురేష్ ని సంప్రదించారట.

తన సినిమాలోని పాత్ర కోసం అడగగా కీర్తి సురేష్ సున్నితంగా రిజెక్ట్ చేసిందట.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు నాకు కల్కి సినిమాలో భాగం అవ్వాలని ఉంది అని అడగగా..మీ వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అని డైరెక్టర్ చెప్పారట. దీనికోసం షూటింగ్ కి ఏమైనా రావాలంటే షూటింగ్ కి అవసరం లేదు. వాయిస్ ఇస్తే చాలు అని నాగ్ అశ్విన్ చెప్పారట.అలా మొదట తనకి ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసానని,కానీ ఆ తర్వాత బుజ్జి కారు కి నా వాయిస్ ఓవర్ ఇచ్చానని కీర్తి సురేష్ తెలిపింది.అలాగే కల్కి పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను అంటూ కీర్తి సురేష్ తెలియజేసింది. ఇక ఈ విషయాన్ని రఘుతాత మూవీ ప్రమోషన్స్ లో బయట పెట్టింది. కానీ కల్కి మూవీలో తనని ఏ పాత్ర కోసం దర్శకుడు అడిగారో మాత్రం చెప్పలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: