తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ సంస్థ ఒకటి. టీ జీ విశ్వ ప్రసాద్ ఈ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఈయన గత రెండు , మూడు సంవత్సరాల నుండి అనేక సినిమాలను నిర్మించాడు. ఈయన అనేక సినిమాలను నిర్మించిన అందులో సక్సెస్ అయిన సినిమాల సంఖ్య మాత్రం చాలా తక్కువ గానే ఉంది. కొంత కాలం క్రితం ఈ బ్యానర్ వారు మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాక అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించారు.

మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈ సంస్థకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఈ సంస్థ వారు రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ అనే మూవీ ని రూపొందించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ సంస్థ వారు రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను రూపొందించారు.

ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే పీపుల్స్ మీడియా సంస్థ వారు రవితేజ తో మొదటి సారి రూపొందించిన ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈగల్ మూవీ బ్యానర్ లో రూపొందించగా ఆ మూవీస్బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి మిస్టర్ బచ్చన్ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , ఈ బ్యానర్ కు ఎలాంటి సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

omf