మెగాస్టార్ చిరంజీవి ఎవరి బ్యాగ్రౌండ్ లేకపోయిన తన స్వయం కృషి తో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి మళ్లించాడు. అందులో భాగంగా ప్రజారాజ్యం అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత చిరంజీవి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" అనే సినిమాలో హీరో గా నటించాడు. పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నటించిన చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. పోయిన సంవత్సరం చిరంజీవి మొదట సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ సినిమా థియేటర్లలో విడుదల అయింది.

సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన అపజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో సంవత్సరం అవుతుంది. దానితో చాలా మంది మెగా ఫ్యాన్స్ మళ్లీ భోళా శంకర్ లాంటి సినిమా చిరు కెరియర్లో రాకూడదు అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: