తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఈ వి వి సత్యనారాయణ కుమారుడు. ఇకపోతే అల్లరి నరేష్ , రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అల్లరి అనే సినిమాతో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించాడు. కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా అల్లరి సినిమా సమయంలో జరిగిన ఒక ఇన్సూరెన్స్ గురించి ఆయన చెప్పుకొచ్చాడు. తాజాగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... నా మొదటి సినిమా అల్లరి. దానికి రవి బాబు దర్శకత్వం వహించగా , సురేష్ బాబు ఆ మూవీ ని నిర్మించాడు. ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. డబ్బింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి. నాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఒక రోజు రవి బాబు గారు వచ్చి నీ డబ్బింగ్ చెప్పావా అన్నాడు లేదు అన్నాను. తొందరగా కంప్లీట్ చెయ్ అని అన్నాడు.

దానితో నేను వెంటనే ఆ రోజు రాత్రి 11 గంటలకు ఆ సినిమా డబ్బింగ్ ను చెప్పడం స్టార్ట్ చేశాను. ఉదయం 5 గంటల వరకు డబ్బింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇక సురేష్ బాబు గారికి జాయిన్ చేసే అలవాటు ఉంది. ఆ రోజు ఆయన నేను డబ్బింగ్ చెప్పే ప్రదేశానికి జాగింగ్ చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. డబ్బింగ్ చెప్పాను సార్ అన్నాడు. కంప్లీట్ చేశావా అన్నాడు. కంప్లీట్ చేశాను అన్నాను. దెబ్బకు ఆయన షాక్ అయ్యాడు. అలా నేను కేవలం 6 గంటల్లోనే డబ్బింగ్ చెప్పడంతో సురేష్ బాబు ఆ రోజు షాక్ అయ్యారు అని అల్లరి నరేష్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: