హీరోయిన్ రష్మిక క్రేజ్ ఇప్పుడు ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కూడా సంపాదించింది.అయితే అలాంటి ముద్దుగుమ్మ ని ఓ డైరెక్టర్ అసలు నీ మొహానికి యాక్టింగ్ వస్తుందా.. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.. అంటూ ఘోరంగా అవమానించారట.మరి ఇంతకీ స్టార్ హీరోయిన్ రష్మికను అంతలా అవమానించిన డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది హీరోయిన్లు సినిమాల్లోకి రావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఇక మరి కొంతమంది  సినిమాలలో ఎలాగైనా రాణించాలి అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నిర్మాతల, దర్శకుల, హీరోల కోరికలు తీరుస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోతూ ఉంటారు.

 ఇక మరి కొంతమందేమో  వారసత్వంగా తండ్రులు, తాతలు, అమ్మలు ఇలా వారి పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీ కి వస్తారు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్లు మాత్రం స్టార్స్ అవుతారు.అలాంటి వారిలో రష్మిక మందన్నా ఒకరు.అయితే ఈ హీరోయిన్ కి కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయట. ఆడిషన్ కి వెళ్ళిన ప్రతి రోజు కంటి నిండా నీరుతో ఇంటికి వచ్చేదట.ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి రష్మిక తల్లి ఓదార్చి ధైర్యం నింపేదట. ఇక ఓ సినిమా షూటింగ్ కోసం అయితే చాలాసార్లు రష్మికను ఆడిషన్ చేసి చివరికి తీసుకొని హీరోయిన్గా ఫిక్స్ అయ్యాక చివరికి సినిమా రద్దయిందని చెప్పారట.

ఆ సమయంలో రష్మిక చాలా బాధపడిందట. ఇక ఓ డైరెక్టర్ అయితే నేరుగా అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.. నీ  మొహానికి యాక్టింగ్ వస్తుందా అని తిట్టి అవమానించారట. అలా సినిమాల్లోకి రాకముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాను అంటూ రష్మిక తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.అలాగే తన నటనపై దర్శక నిర్మాతలు ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేదని, కానీ నా మొదటి సినిమా హిట్ కొట్టినప్పటి నుండి సినిమా సినిమాకి మధ్య నా నటనను మెరుగుపరచుకున్నాను అంటూ రష్మికా మందన్నా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: