గడిచిన కొద్ది రోజుల క్రితం బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరు ఒక్కసారిగా వైరల్ గా మారింది.. ఇందులో హేమ కూడా అరెస్ట్ కావడంతో అటు తెలుగు సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి. వీటన్నిటి కంటే నటి హేమ చేసిన ఓవర్ యాక్షన్ చేసిన ఘటన వైరల్ గా మారింది. హేమ గురించి కొన్ని వార్తలు రావడంతో ఆమె ఇదంతా కూడా కట్టు కథలు అంటూ తెలియజేసింది. తాను హైదరాబాదులోనే ఉన్నానంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది హేమ.. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం ఈమెను అరెస్టు చేయడం జరిగింది.


ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన హేమ సైలెంట్ అయ్యింది. ముఖ్యంగా మా అధ్యక్షులు మంచు విష్ణు కూడా ఆమెకు అండగా నిలిచారు. దోషిగా తేలితేనే తప్ప ఆమె గురించి ఎవరూ కూడా దుష్ప్రచారం చేయొద్దండి అంటూ తెలియజేశారు. తాజాగా ఇటీవలే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపింది.. మే 19న బెంగళూరు రేవు పార్టీలో తన పైన కేసు నమోదు అయ్యిందని అయితే తనకు టెస్టులు చేసింది జూన్ మూడవ తేదీ..  తనకు పాజిటివ్ రాకపోయినా కూడా వచ్చిందంటూ పలు రకాల న్యూస్ ఛానల్ వైరల్ గా చేశాయంటూ తాను నిర్దోషిని అంటూ తెలియజేసింది. ఈ విషయంపై తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం కూడా కలుస్తానని తెలిపింది.


తాను ఎలాంటి టెస్ట్ కైనా కూడా సిద్ధంగానే ఉన్నానంటూ తెలిపింది హేమ.. ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయం పైన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విక్టరీ పైన హేమ స్పందిస్తూ.. తాను కూడా పక్క కాపు మనిషినని ఎన్నోసార్లు ఓపెన్ గా చెప్పానని అలాంటిది తమ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆనందాన్ని ఎంజాయ్ చేయకుండా చేశారని తెలుపుతోంది. జై జనసేన.. జై కాపు అంటూ గట్టిగా అరవలేకపోయానని హేమ ఎమోషనల్ గా మాట్లాడింది. చివరికి పవన్ స్టైల్ లో మెడ వెనుకకు చెయ్యి పట్టుకొని హల్చల్ చేస్తోంది హేమ.

మరింత సమాచారం తెలుసుకోండి: