తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె కొంతకాలం క్రితం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో కీర్తి సురేష్ , మహానటి సావిత్రి పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. కొన్ని రోజుల క్రితం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD సినిమా థియేటర్లలో విడుదల అయిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో ప్రభాస్ హీరో గా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ నడిపే బుజ్జి అనే వెహికిల్ కీర్తి సురేష్ డబ్బింగ్ ఇచ్చింది. తాజాగా కీర్తి ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ కల్కి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. కీర్తి సురేష్ తాజాగా మాట్లాడుతూ ... నాగ్ అశ్విన్ కల్కి సినిమాలో నాకు ఒక పాత్ర ఉంది అని చెప్పాడు. కాకపోతే నాకు ఎందుకో ఆ సమయంలో సినిమా చేయడం ఇష్టం లేదు.

దానితో నేను చేయలేను అని చెప్పాను. ఇక ఆ తర్వాత కొంత కాలానికి నాగ్ అశ్విన్ మళ్లీ నాకు ఫోన్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ దగ్గర బుజ్జి అని ఒక వెహికల్ ఉంటుంది. దానికి నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అన్నాడు. దానికి నేను షాక్ అయ్యాను. నేను షూటింగ్ స్పాట్ కి రావాల్సిన అవసరం లేదా అని అన్నాను. నువ్వు షూటింగ్ కి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ డబ్బింగ్ చెబితే సరిపోతుంది అన్నాడు. దానితో నేను చెప్పాను. అలాగే బుజ్జి అనే వెహికల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. అది చాలా సక్సెస్ అయ్యింది అని కీర్తి సురేష్ తాజాగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ వరస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks