కూచిపూడి డ్యాన్సర్, తెలుగు నటి అయిన సంధ్యారాజుకు సరైన గౌరవం దక్కింది. స్వయంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశం ఆమెకు వచ్చింది. 77వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌కు సంధ్యా రాజు వెళ్లనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో జరిగే ఎట్ హోమ్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమెకు ఇన్విటేషన్ అందింది. తన మొదటి సినిమా నాట్యం ఎంతో క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ మూవీకిగాను రెండు జాతీయ పురస్కారాలు లభించాయి. తమిళనాడులోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన పి.ఆర్.వెంకట్రామరాజా కూతురే ఈ సంధ్యారాజు. హైద‌రాబాద్‌లో నిశృంఖ‌ల డ్యాన్స్ అకాడమీని స్థాపించింది. అలాగే నిశృంఖ‌ల ఫిల్మ్ ఫౌండ‌ర్‌గా కూడా సినీ రంగంలో కొనసాగుతోంది.

నృత్య క‌ళ‌ ద్వారా ప్ర‌పంచానికి పరిచయమైన సంధ్యారాజు.. తన డ్యాన్స్ షోస్‌తోనే కాకుండా సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంది. నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్‌గా జాతీయ పురస్కారాన్ని అందుకుని ఫేమస్ అయ్యింది. కొరియోగ్రాఫర్‌గా కూడా పలు పాటలకు తన పాదాన్ని కదిపింది. నిర్మాతగా మారి భార‌తీయ సాంస్కృతిక రంగంలో చాలా మందికి రోల్ మోడల్‌గా నిలిచింది.

ఆగస్టు 15వ తేదిన సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హొమ్ రిసెప్షన్ నిర్వహిస్తారు. ప్రతి ఏటా సాంప్రదాయంగా జరిగే ఈ కార్యక్రమానికి సంధ్యారాజు వెళ్లనున్నారు. ఆగస్టు 15న ఉదయం జెండా వందనం అవ్వగానే ఆ రోజు సాయంత్రం ఎట్ హోమ్ రిసెప్షన్ ఉంటుంది. ఆ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము హాజరై అతిథులతో ప్రత్యేకంగా మాట్లాడుతారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న వారంతా ఎట్ హోమ్‌కు హాజరవుతారు. రాష్ట్రపతి భవన్‌లో వారికి ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేస్తారు. కూచిపూడి డ్యాన్సర్, తెలుగు నటి సంధ్యారాజు కూడా ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మాట్లాడనున్నారు. తెలుగు నటికి, ఒక కూచిపూడి నృత్యకారిణికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆమె అభిమానులు ఆనందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: