మహేష్ తన కెరియర్ లో తనకు ఒక హిట్ ఇచ్చిన దర్శకులకు రెండవ సారి అవకాశం ఇచ్చి న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ చాలా సందర్భాలలో ప్రభాస్ ఒక సారి తనకు హిట్ ఇచ్చిన దర్శకులను నమ్మి రెండో అవకాశం ఇచ్చిన అందులో చాలా మంది తన నమ్మకాన్ని వోమ్ము చేశారు. వారు ఎవరో తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ ప్రారంభంలో ఒక్కడు అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.

ఇక గుణశేఖర్ పని తనం హార్డ్ వర్కింగ్ నచ్చి మహేష్ బాబు అతనికి ఆ తర్వాత సైనికుడు , అర్జున్ సినిమాలకు అవకాశం ఇచ్చాడు. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం ఒక్కడు స్థాయి విజయం అందుకోలేదు. కాకపోతే ఈ సినిమా కోసం గుణశేఖర్ చాలా కష్టపడ్డట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఆ తర్వాత శ్రీను వైట్ల తో మహేష్ బాబు "ఆగడు" అనే సినిమా చేశాడు. కానీ ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. మహేష్ బాబు , శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చాడు. దానితో ఆయన మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా మహేష్ తనకు ఒక హిట్ ఇచ్చిన కొంత మంది దర్శకులకు రెండవ అవకాశం ఇచ్చిన వారు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: