కొంత మంది స్టార్ హీరోలు తమ దగ్గరికి కొన్ని కథలు వచ్చిన సమయంలో ఆ కథ అద్భుతంగా ఉండే అది బ్లాక్ బాస్టర్ అవుతుంది అని తెలిసినా కూడా వారికి ఉన్న మాస్ ఈమేజ్ కారణంగా ఆ మూవీలు ఆడకపోవచ్చు అనే ఉద్దేశంతో కూడా సినిమాల కథలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా అలాంటి సందర్భం ఒకటి వచ్చింది. దాని గురించి ఆయనే ఒకానొక సమయంలో తెలియజేశాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిన కథ ఏది ... దానిని ఆయన ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొంతకాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... నాకు కొంత కాలం క్రితం బొమ్మరిల్లు కథను విడిపించారు. ఆ స్టోరీ విన్న తర్వాత అద్భుతంగా అనిపించింది. ఆ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అవుతుంది అని నాకు అనిపించింది. కాకపోతే ఆ కథను నాపై తీస్తే మాత్రం అది వర్కౌట్ కాదు ... ఎందుకు అంటే నా ఫ్యాన్స్ మరియు మామూలు ప్రేక్షకులు కూడా నాపై ఫైట్లు , డాన్సులు , మాస్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అవి ఏవి ఆ సినిమాలో లేవు. ఆ సినిమా చాలా సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది.

వారు నా సినిమాలో పాటలు , ఫైట్లు , డాన్సులు , డైలాగ్ లు ఉంటాయి అని వస్తారు. అవి ఏవి లేకపోవడంతో వారు డిసప్పాయింట్ అయ్యి ఆ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఆ సినిమా చేయను అని చెప్పాను. అలా కథ బాగున్న కూడా నాకు సెట్ కానప్పుడు ఆ సినిమా చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి నేను ఆ స్టోరీని రిజెక్ట్ చేశాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన బొమ్మరిల్లు సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: