వీరిద్దరూ కొన్నేళ్లపాటు సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించి వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం ఎంతో సంతోషంగా గడిపారు ఈ జంట. ఇక ఏవో కొన్ని కారణాలతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల తర్వాత సినిమాల పరంగా సమంతకు, నాగచైతన్యకు పెద్దగా సక్సెస్ రావడం లేదు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య ఆగస్టు 8వ తేదీన శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. మేము శోభితతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది.
సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య చాలా బాధపడ్డాడు. కానీ ఎవరితో ఆ విషయాన్ని షేర్ చేసుకోలేదంటూ పేర్కొన్నాడు. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత సమంత కాస్త బాధపడినట్లు సమాచారం. వివాహానికి ముందు సమంత కెరియర్ పీక్స్ లో ఉండేది. తనతో సినిమాలు చేయడానికి హీరోలు ఎదురుచూసేవారు. కానీ వివాహం తర్వాత పెద్ద ఇంటి కోడలు కావడంతో సినిమాలు చేయడానికి కాస్త భయపడ్డారట.
రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి కాస్త ఇబ్బంది పడినట్లు టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు నాగచైతన్య రెండవ వివాహం చేసుకున్నాడు కాబట్టి సమంతను ఆపేవారు ఎవరూ లేరు. సమంత ఎలాంటి సీన్స్ లో నటించిన, ఏ హీరోతో సినిమాలు చేసిన అడిగే వారు ఎవరూ ఉండరు. ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్ తో సమంతకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చినట్టే. తన కెరీర్ తాను హ్యాపీగా చూసుకోవచ్చని తన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత చాలామంది సమంతకు సపోర్టుగా మాట్లాడుతున్నారు.