స్టార్ కపుల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ తన భార్య లక్ష్మీ ప్రాణతీయుల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ప్రణతి స్టార్ హీరో భార్య అయినప్పటికీ చాలా సింపుల్గా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటుంది . అంతేకాకుండా బయట కెమెరా ముందు కూడా పెద్దగా కనిపించదు . అలాగే సినిమా ఈవెంట్స్ కి హాజరు కాదు . అసలు లక్ష్మీ ప్రణతి నేచర్ ఎటువంటిది ఆమె ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలు ఎవ్వరికీ పెద్దగా తెలియదు .


కానీ రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ వంటి ఇతర హీరోల భార్యలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది . ఈ క్రమంలోనే తాజాగా లక్ష్మీ ప్రణతిని ఉద్దేశిస్తూ ఆమె తమ్ముడు నార్నె నితిన్ ఆసక్తిగా కామెంట్స్ చేశాడు . నితిన్ హీరోగా ఆయ్ సినిమా ద్వారా ఆగస్టు 15వ తేదీన మన ముందుకు రాబోతున్నాడు . ఈ మూవీకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు నితిన్ . ఇక ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు .


తమ్ముడిగా నాకు అక్కతో మంచి బాండింగ్ ఉంది .. కానీ ఆమె చాలా రిజర్వ్డ్. ఆమె ఎవరిని కలవదు పెద్దగా మాట్లాడదు కూడా . కానీ మా మధ్య మాత్రం మంచి అనుబంధం ఉంది .‌.. అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు . ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వారు అవుతున్నారు . కాగా లక్ష్మీ ప్రాణతిని 2011లో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు . వీరికి ఇద్దరూ సంతానం కూడా జన్మించారు . పెద్దబ్బాయి పేరు అభిరామ్ కాగా చిన్నబ్బాయి పేరు భార్గవ్ రామ్ . వీరిద్దరూ తన తండ్రితో పలు కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారు . ఇక ఎన్టీఆర్ చిన్న కొడుకు అచ్చం ఎన్టీఆర్ ని గుర్తు చేసే విధంగా ఉంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి: