యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి మొట్ట మొదటి మాస్ బ్లాక్ బాస్టర్ మూవీ దక్కింది ఆది సినిమాతో. ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే వి వి వినాయక్ ఈ సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించాడు. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. కొంత కాలం క్రితం ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆది సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈయన తాజాగా తెలియజేశాడు.

వి వి వినాయక్ "ఆది" సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ... జూనియర్ ఎన్టీఆర్ హీరో గా ఆది మూవీ ని రూపొందిస్తున్న సమయంలో చాలా మంది ఆయన చిన్న కుర్రాడు. అతనితో ఫ్యాక్షన్ సినిమా ఏంటి ... వర్కౌట్ అవుతుందా అని చాలా మంది అన్నారు. కాకపోతే నేను మొదటి నుండి కూడా ఒక స్టూడెంట్ ఫ్యాక్షన్ లీడర్ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తోనే కథ రాసుకున్నాను. దానినే చూపించాలి అనుకున్నాను. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తో ఫ్యాక్షన్ మూవీ ని రూపొందించాను అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశారు.

ఇకపోతే ఆది సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరో గా వి వి వినాయక్ దర్శకత్వంలో అదుర్స్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా వీరి కాంబోలో ఇప్పటి వరకు రూపొందిన రెండు సినిమాలలో రెండు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. వి వి వినాయక్ ఆఖరుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఛత్రపతి మూవీ ని హిందీ లో రీమిక్ చేశాడు. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: