ఇటీవల శనివారం రోజున వచ్చిన నాగార్జున ఎప్పటిలాగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి తప్పులను తెరమీదకి తీసుకువస్తూ క్లాస్ పీకారు. ఈ క్రమంలోనే నేడు నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై రకరకాల ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. అయితే మొదటి వారిమే కావడంతో అటు కంటెస్టెంట్స్ మధ్య పెద్దగా పరిచయాలు కూడా అవ్వలేదు. దీంతో ఏ కారణం చూపాలో తెలియక చిన్నచిన్న కారణాలతోనే నామినేషన్స్ కూడా చేసుకోవడం చూశాము. అయితే అటు ప్రేక్షకులకు కూడా ఎవరు ఏంటి అన్నది అర్థం కాలేదు కానీ ఏదో ఓట్లు మాత్రం వేశారు.
దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. విష్ణుప్రియ శేఖర్ భాషాలకు మంచి క్రేజ్ ఉండడంతో ఇద్దరికీ బాగానే ఓట్లు పడ్డాయట. ఇక సింపతి కార్డు వాడుకున్న మణికంఠకు కూడా జనంలో వర్కౌట్ అయిందట. పృథ్వి, సోనియా ఆకుల బాగానే ఓట్లు పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఎటోచ్చి ఇప్పుడు బెజవాడ బేబక్క మాత్రం డివిజనల్ రోల్ లో ఉందట. మంచి మాటకారి అయిన బేబక్క హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోయారు. బిగ్బాస్ అర్థం కాక ఇలా ఉండిపోయారు అనేది తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె బయట ఉంటేనే మాకు ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని ఎంతమంది అనుకుంటారు. అందుకే ఆమెను బయటకు తీసుకురావాలని అనుకున్నరట. అందుకే ఈవారం బేబక్క ఎలిమినేట్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.