త్వరలోనే విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని కూడా అందరూ భావిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో భారీ అంచనాలతో వచ్చిన ది గోట్ సినిమా ఇంత డిజాస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అసలు థియేటర్లలో హుషారు అన్నదే లేదు .. విజయ్ గత సినిమాలో మాస్టర్ - అదిరింది - వారసుడు - లియో తెలుగు పంపిణీ దారులకు మాంచి లాభాలు తెచ్చిపెట్టాయి .. బీస్ట్ యావరేజ్ గా ఆడింది .. కానీ గోట్ మాత్రం పరమ చెత్తగా ఉందని ట్రేడ్ చెపుతోంది. విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గోట్ అంటున్నారు.
తెలుగులో ఇలాంటి ఫలితం ఉంటే తమిళంలో కూడా ఓ మోస్తరు గా ఆడుతోందని ఓవర్సీస్ లోను జస్ట్ ఓకే అంటున్నారని టాక్ వినిపిస్తుంది. తెలుగులో గోట్ ఇంత పెద్ద ప్లాప్ అవ్వటానికి కారణం ఈ సినిమాకు సరైన ప్రమోషన్లు లేవు. కంటెంట్ పరంగా చాలా వీక్ గా ఉంది ... మ్యూజిక్ కూడా ప్రభావం చూపలేదు ... ట్రైలర్ కానీ పాటలు కానీ నచ్చలేదు .. అసలు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు బజ్ ఏ మాత్రం క్రియేట్ కాలేదు. దీనికి తోడు భారీ వర్షాల కారణంగా కూడా జనం ధియేటర్ల వైపు వెళ్ళటం లేదు .. ఇవన్నీ కలిసి ఇది గోట్ సినిమాను తెలుగులో విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం డిజాస్టర్ సినిమాగా మిగిల్చే లా చేశాయి.