దేవర మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాయి. గత ఏడాది యానిమల్ సినిమాతో మరొకసారి మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన తదుపరి చిత్రం ప్రభాస్ స్పిరిట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లాల ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ T- సిరీస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.
కానీ జూనియర్ ఎన్టీఆర్ తో స్వయంగా డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ మీట్ అవడంతో అభిమానులు ఏదైనా వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనే విధంగా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో కనుక సినిమా హిట్టు పడితే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అంటూ అభిమానులు ధిమా చేస్తున్నారు. మరి రేపటి రోజున ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు సందీప్ రెడ్డి వంగ వచ్చారంటే కచ్చితంగా సినిమా అప్డేట్ గురించి చెబుతారని ఆశగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ ఫొటోస్ అయితే వైరల్ గా మారుతోంది. ఎన్టీఆర్ దేవర చిత్రం తర్వాత వార్-2 సినిమాలో నటించబోతున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు.