బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా సుధాకర్ చెరకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్లో మేకర్స్ చాలా స్టైలిష్ గా చూపించారు. చాలా స్లిమ్ అయినట్టుగా మోక్షజ్ఞ ను చూపించారు.గతంలో చాలా బొద్దుగా ఉండి ట్రోల్ కి గురి కావడం కూడా జరిగింది. కచ్చితంగా మోక్షజ్ఞ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొట్టాలను ఉద్దేశంతోనే ఇలా ప్రశాంత్ వర్మతో సినిమా కాయం చేశారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య కుమారుడు మొదటి చిత్రానికి రూ .18 నుంచి రూ .20 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. నందమూరి అభిమానులు సైతం తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.. బాలయ్య ప్రస్తుతం ఒక చిత్రానికి రూ .18 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు మొదటి సినిమాకి మోక్షజ్ఞ అంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉన్నదో తెలియాల్సి ఉన్నది. ఇక హీరోయిన్ ఎవరు నటీనటులు ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది.