ముఖ్యంగా తన పేరులో నిత్యా మేనన్ లో "మేనన్" అనేది తన ఇంటి పేరు కాదని.. అలా పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉన్నదంటూ తెలియజేసింది. అసలు తన పేరు..S.S. నిత్య అంటూ తెలియజేసింది. తన తల్లిదండ్రుల పేర్ల విషయానికి వస్తే నళిని, సుకుమార్ అని తెలియజేసింది. ఆ పేర్లలో మొదటి అక్షరాలను తీసుకొని తాను ఎస్ఎస్ నిత్యా అని పెట్టుకున్నట్లు తెలియజేసింది. అయితే తన కుటుంబంలో ఎవరూ కూడా ఇంటి పేరుని ఉపయోగించకూడదని ఎందుకంటే కులాన్ని పేర్లతో ముడి పెట్టడం తమ కుటుంబానికి ఇష్టం ఉండదని తెలియజేసింది నిత్యామేనన్.
ముఖ్యంగా తాను నాటిక ఎన్నో చోట్ల ప్రయాణిస్తూ ఉంటాను అందుకే తన పాస్పోర్టులో మాత్రమే మేనన్ అనే పేరును జతచేసినట్లుగా వెల్లడించింది నిత్యా మేనన్. అయితే ఇదంతా కేవలం న్యూమరాలజీ ఆధారంగానే సెట్ చేసుకున్నాను అంటూ తెలియజేసింది.. దీంతో అసలు ఆమె పేరు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిత్యామేనన్ ఫ్యామిలీ మొత్తం గత 30 ఏళ్లుగా బెంగళూరులోనే ఉంటున్నారట. తన స్కూలు వయసు నుంచి అక్కడే చదివానని సెకండ్ లాంగ్వేజ్ క్రింద కన్నడ నేర్చుకున్నాను అని తెలియజేసింది. చాలా మంది తనని మలయాళం అమ్మాయి అనుకుంటున్నారని అది రాంగ్ అంటూ తెలియజేసింది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఒక సినిమా, అలాగే కోలీవుడ్ హీరో జయం రవితో కూడా మరొక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.