చిన్న సినిమాల ఓటిటి హక్కులు తీసుకోవడంలో కాస్త బెట్టు చేసిన ఓటీపీ సంస్థలు ముఖ్యంగా అగ్రతారలు నటించే సినిమాల హక్కులు కొనటంలో పోటీ పడుతుంటాయి. అయితే ఇప్పుడు అగ్రతారల విషయంలో కూడా హక్కులను కొనే ధర విషయంలో ఓటీపీ సంస్థలు ఆచితూచి అడుగులేస్తున్నాయట. ఇప్పుడు విశ్వంభరా ఓటిటి హక్కుల విషయంలో నిర్మాతలు కోట్ చేసిన అమౌంట్ ను ఇవ్వడానికి ఓటిటి సంస్థలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్వహిస్తోంది.
సినిమా నిర్మాణ వ్యయం పెరగటంతో విశ్వంభరా హక్కుల కోసం పోటీపడుతున్న ఓటిటి సంస్థలకు నిర్మాతలు అత్యధిక అమౌంట్ ను కోట్ చేశారు. అయితే నిర్మాతలు ఆశిస్తున్న దానిలో సగం ధరకే ఓటీపీ సంస్థలు విశ్వంభరా హక్కులు తీసుకోవటానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఓటీపీ సంస్థలు ఇచ్చిన ఆఫర్ చూసి నిర్మాతలు మా సినిమాను ఇంత తక్కువకు అడగటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు ఓటీపీ హక్కుల కోసం పోటీపడిన సంస్థలు ఇప్పుడు కాస్త స్పీడును తగ్గిస్తూ..ఓటిటి రైట్స్ విషయంలో ఆచితూచి వెళ్లడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే.