మెగాస్టార్‌ చిరంజీవి ఎన్నో సినిమాలో నటించి విపరీతమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నాడు. అయితే సినిమాల పరంగానే కాకుండా చిరంజీవి నటీనటులకు, బయటి వ్యక్తులకు ఎలాంటి కష్టం వచ్చినా సరే వెంటనే ముందు వరసలో ఉంటాడు. తాజాగా చిరంజీవి తన మంచి మనసును చాటుకున్నాడు. కామెడీ విలన్ గా ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన ఫిష్ వెంకట్ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.


ఇటీవల తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో ఫిష్ వెంకట్ తన దీనమైన పరిస్థితిని తెలియజేశాడు. దీంతో ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, మీడియాకు చెందినవారు ఫిష్ వెంకట్ కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సహాయం వారు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో... ఆయన వెంకట్ గురించి తెలుసుకొని అపోలో ఆస్పత్రిలో తన తరఫున ఫిష్ వెంకట్ కి ఉచిత చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ కు చికిత్స ప్రారంభమైంది.


అంతేకాకుండా చిరంజీవి ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట. కాగా, ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన వెంకట్ లో కామెడీని అద్భుతంగా పండించేవాడు. ఎక్కువగా వెంకట్ కామెడీ, సహాయ పాత్రలు చేసి మెప్పించాడు. ప్రస్తుతం ఇతను సినిమాలకు దూరంగా ఉన్నాడు. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమై ఎన్నో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.


తన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. షుగర్, బీపీ సమస్యలు మొదలుకావడం... అంతేకాకుండా కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కావడం, రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడట. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ సహాయం కోసం ప్రార్థిస్తున్నాడు. ఈ విషయం తెలిసి చాలామంది వారికి తోచినంత సహాయాన్ని చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: