ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. ఇలా ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు అన్న విషయాలను తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. అయితే రెండో వారం ఓటింగ్ లో షాకింగ్ మార్పులు చోటు చేసుకున్నాయ్ అన్నది తెలుస్తుంది. మొదటి రెండు రోజుల్లో ఒకలా సాగిన ఓటింగ్ మూడో రోజు మాత్రం మారిపోయింది. గత ఎపిసోడ్లో విష్ణుప్రియను ఒక గ్యాంగ్ టార్గెట్ చేయడంతో ఆమెకు సానుభూతి పెరిగింది. ఫలితంగా అత్యధిక ఓట్లు వచ్చి ఆమె టాప్ లోకి వెళ్ళిపోయింది. ఇక రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడు.
వీళ్ల తర్వాత మూడో స్థానంలో నాగమణికంఠ, నైనిక నాలుగో స్థానంలో, శేఖర్ భాష ఐదవ స్థానంలో ఉన్నారు. అయితే ఆరో స్థానంలో ఆదిత్య ఓం ఉండగా అతని కంటే తక్కువ స్థానమైన 7, 8 స్థానాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న కిర్రాక్ సీతా, పృద్వి ఉన్నారు అని చెప్పాలి. అంటే ఇక చివరి మూడు స్థానాల్లో ఉండే ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే హౌస్ లో పెద్దగా వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్న ఆదిత్య ఓం ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అని ఉంది ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఏం జరగబోతుందో చూడాలి మరి.