ఇప్పటికే మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఈ తరానికి తనను మించిన లెజెండ్ ఇంకొకరు లేరు అన్న విషయాన్ని కూడా ఇప్పటివరకు విరాట్ కోహ్లీ నిరూపించాడు అని చెప్పాలి. ఇక ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించి.. ఇలా రికార్డులు సాధించడం విషయంలో కూడా నేటితరం క్రికెటర్లకు ఎవరికి అందనంత ఎత్తులో కొనసాగుతున్నాడు ఈ స్టార్ ప్లేయర్. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఆట తీరుతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్నాడు అని చెప్పాలి అయితే అందరిలాగానే తాను కూడా కోహ్లీ అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది ఓ బాలీవుడ్ హీరోయిన్.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనన్య పాండే ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అంటూ హీరోయిన్ అనన్య పాండే చెప్పుకొచ్చింది. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె తెలిపింది. కాల్ మీ బే ప్రమోషన్లలో ఈ వ్యాఖ్యలు చేసింది అనన్య. కోహ్లీ గ్లోబల్ ఐకాన్. ఆయనలో ఏదో తెలియని శక్తి ఉంది. విరాట్ కోహ్లీలోని నాయకత్వ లక్షణాలు ఆయన జట్టును ముందుకు నడిపించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అంటూ అనన్య పాండే తెలిపింది. కాగా అనన్య టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీలో నటించింది అన్న విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను విజయ్ దేవరకొండ హీరోయిన్ అని పిలుచుకుంటూ ఉంటారు.