డిప్యూటీ సీఎం అయి బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్స్ అని వాయిదా పడ్డాయి. తొందరలోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలోనే ఓజి తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటించనున్నారు. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే..తాజాగా, శ్రియ ఓ జి సినిమా కోసం కర్రసాము శిక్షణ తీసుకుంటున్నట్లు ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.
శారీరక బలం, చురుకుదనాన్ని చూపిస్తూ కఠినమైన శిక్షణ పొందుతోంది. అయితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. కాగా, ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీలో ఓ ప్రధాన పాత్రలో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పలు చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ స్టార్ నటిగా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ప్రజెంట్ శ్రియా రెడ్డి కర్ర సాము నేర్చుకుంటున్నా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్టుని చూసి పలువురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.