అయితే అలాంటి సమయంలోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో తన కెరియర్ మలుపు తిరిగింది. నటనను నమ్ముకుని కెరీర్ మొదట్లో సినీరంగంలో ఓ మెరుపు మెరిసింది. ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో తన ఒళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో తప్పటడుగు వేసిన ఈ నటి అత్యంత దీనస్థితిలో 2007 సంవత్సరంలో ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందింది. 1980లో నిషా నూర్ తన గ్లామర్ తో తెలుగు, మలయాళ, తమిళ్, కన్నడ భాషల్లో వరుసగా సినిమా ఆఫర్లను అందుకొని స్టార్ హీరోయిన్గా రాణించింది.
చంద్రశేఖర్, బాలచంద్రన్, విసు, భారతీరాజా వంటి గొప్ప డైరెక్టర్లతో సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. రజినీకాంత్, కమల్ హాసన్, భానుచందర్, రాజేంద్రప్రసాద్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతోనూ కలిసి పని చేసింది. ఇక 1995 తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అప్పటివరకు తాను సంపాదించిన డబ్బుంతా కొద్దికాలంలోనే ఆవిరైపోయింది.స్టార్ డమ్ స్టేటస్ అనుభవించిన ఆమె అవకాశాలు రాకపోవడంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది.
బతకడానికి, కుటుంబ పోషణ కోసం వ్య**చార వృత్తిలోకి దిగింది. అయితే ఓ బడా నిర్మాత బలవంతం వల్లే ఇలాంటి వృత్తిలోకి దిగిందని అప్పట్లో ఎన్నో ప్రచారాలు వచ్చాయి. చివరి రోజుల్లో ఎయిడ్స్ తో బక్క చిక్కి పోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతి చెందింది. ఓ తమిళ ఎన్జీవో సాయం చేసేందుకు ముందుకు వచ్చి ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించినప్పటికీ అప్పటికే నిషా నూర్ కి ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ వ్యాధితో తీవ్రంగా పోరాడి శ్రమించిన నిషా నూర్ 2007లో దిక్కుతోచని స్థితిలో అనాధల కన్ను మూసింది.