అమితాబచ్చన్ ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. దీంతో ఈ షో ఒక బ్రాండ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఎంతోమంది ఈ షోలో పాల్గొంటూ అటు అమితాబచ్చన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటారు. అది సరేగాని ఇప్పుడు కౌంట్ బనేగా కరోడ్పతి షో గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఇటీవల ఒక టాలీవుడ్ హీరో ప్రముఖ రాజకీయ నాయకుడు గురించి కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఒక ఆసక్తికర ప్రశ్న వచ్చింది. ఇక ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న వచ్చింది. 2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న నటుడు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ఇక ఈ ప్రశ్నకు ఆప్షన్స్ గా ఏ. పవన్ కళ్యాణ్ బి.చిరంజీవి సి. నాగార్జున డి.బాలకృష్ణ అనే ఆప్షన్లను ఇచ్చారు. ఇక ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎంతో సులభం అనుకుంటున్నారు కదా. అయితే ఇక ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ లైఫ్ లైన్ తీసుకొని ఆడియన్స్ పోల్ ఆధారంగా ఇక పవన్ కళ్యాణ్ అనే ఆన్సర్ చెప్పారు.