శివాత్మిక సౌకర్యవంతమైన జిమ్ షార్ట్స్, టీ-షర్ట్‌లో ఉంటూ, లెగ్ వర్కౌట్స్ నుంచి పుల్-అప్స్ వరకు వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నట్లు చూడవచ్చు. ఆమె కష్టపడే తీరు, శక్తి చూసేవారికి చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాయి. ఆమె టోన్‌డ్ ఫిజిక్ చూసి చాలామంది వావ్ అంటున్నారు.
శివాత్మిక ఎలా వ్యాయామాలు చేస్తుందో చూస్తే, అమ్మాయిలందరూ జిమ్‌కి వెళ్లి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆమె వ్యాయామాల విషయంలో ఎంత కష్టపడుతుందో, వాటిని ఎంత ఇష్టపడుతుందో ఆమె పోస్ట్‌లలో చూడొచ్చు. తమ ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనుకునే వారికి ఆమె చాలా మంచి ఆదర్శం.
చివరిగా 'రంగ మార్తాండ' సినిమాలో కనిపించిన శివాత్మిక తన నటన, కష్టపడే తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఏప్రిల్ 22న పుట్టిన ఈ అందాల తారకు ప్రస్తుతం 24 ఏళ్ళే. ఫ్యూచర్ ఇయర్స్‌లో మంచి సినిమాలు ఈమెకు లభిస్తే 30 ఏళ్లలోగా కాజల్, తమన్నా, కీర్తి సురేష్, అపర్ణ బాలమురళి, ప్రియమణి లాంటి దిగ్గజ హీరోయిన్ల వలె పాపులర్ అవుతుంది. రాజశేఖర్ వారసత్వాన్ని ముందుకు సాగిస్తుంది. https://www.instagram.com/reel/C_40Mwst8oU/?utm_source=ig_web_copy_link ఈ లింకు పైన క్లిక్ చేసి ఈ అమ్మడి వర్కౌట్ వీడియో చూడవచ్చు. ఆమె మరిన్ని లేటెస్ట్ పిక్స్, వర్కౌట్ వీడియోలు చూడాలంటే ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో కావచ్చు. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.