ఈ క్రమంలోనే అన్ని భాషల్లో కూడా మేకర్స్ ప్రస్తుతం వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే దేవర మూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులు అందరిలో కూడా అంచనాలను పెంచేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో దేవర సినిమా గురించి నటీనటులు చెబుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు అభిమానుల్లో మూవీపై ఆత్రుతను మరింత పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. దేవర టీం కి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారట.
దేవర సినిమా టీం ఔట్ డోర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారట. ఇలాంటి ప్రమోషన్ చేస్తే సినిమాకు బాగా ప్లేస్ అవుతుందని భావించారట. కానీ ఇలా అవుట్ డోర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పోలీసుల నుంచి అనుమతి రాలేదని సినీ వర్గాల నుంచి సమాచారం. జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న పాపులారిటీ దృశ్య పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో భద్రత పరమైన సమస్యలు ఏర్పడతాయని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారట . ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తోంది.