అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా ఇంకో గంట ఉండగానే ఇందులో ఎక్కువగా బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని కట్ చేసినట్లుగా తెలియజేశారు. అయితే ఇప్పుడు మరొకసారి అర్జున్ రెడ్డి ఫుల్ వర్షన్ ని విడుదల చేయమని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా అందుకు సంబంధించి ఒక విషయం పైన మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సీక్వెల్ కి తన దగ్గర ఒక లైన్ ఉందంటూ తెలుపుతున్నారు సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ ప్రెగ్నెంట్ తో ఉన్న వివాహం చేసుకుంటారనీ తెలిపారు..
అయితే అర్జున్ రెడ్డి సీక్వెల్లో పెళ్లి అయిన తర్వాత అర్జున్ రెడ్డి ఎలా ఉంటారు.. అతని బిహేవియర్ ప్రేమ ఎలా ఉంటుంది అనే కోణంలో రాసుకొచ్చానంటూ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సందీప్ రెడ్డి వంగ. దీంతో విజయ అభిమానులు కూడా అర్జున్ రెడ్డి-2 సినిమా డబల్ డోస్ ఇచ్చేలా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం యానిమల్ సినిమా సీక్వెల్ తీయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్తో అర్జున్ రెడ్డి-2 తీస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.