గంధపు చెక్కల స్మగ్లింగ్ అనేది పాత కథ అయినప్పటికీ అటు డైరెక్టర్ సుకుమార్ తన టేకింగ్ తో అబ్బురపరిస్తే.. ఇక పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోగా.. ఇక దేశంలో ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు అందరూ చుట్టూ చేరి సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉంటారు. అయితే ఇక ఇంతలా అభిమానులు ఉన్న హీరోకి అతని అభిమానులు ఏదో ఒక సమయంలో బహుమతులు ఇవ్వాలని కోరుకోవడం సహజం. అయితే ఇక్కడ ఒక అభిమాని ఇలాంటిదే చేసాడు. ఏకంగా అల్లు అర్జున్ కు ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. ఇంతకీ ఆ అభిమాని ఎవరు అంటారా. ఆ విషయం మాత్రం ఎవరికీ తెలియదు. చివరికి అల్లు అర్జున్ కు కూడా తెలియదు.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు గుర్తు తెలియని వ్యక్తి ఒక బహుమతి పంపించాడు. ఈ క్రమంలోనే ఈ బహుమతి గురించిన విషయాలను ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. ఎవరో తెలీదు కానీ నాకు ఈ పుస్తకాన్ని గిఫ్ట్ గా పంపించారు. అతడి నిజాయితీ నా హృదయాన్ని తాకింది. నాకు పుస్తకాలు అంటే ఇష్టం. ఇక ఈ పుస్తకం రాసిన సీకే ఓబేరాన్ కి ఆల్ ది బెస్ట్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు అల్లు అర్జున్ దీంతో ఇలా బన్నీకి గిఫ్ట్ పంపిన అభిమాని ఎవరో అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.