సన్యా మల్హోత్రా గురించి వినే ఉంటారు. నేటితరం బాలీవుడ్‌లో హాటెస్ట్ లేడీ ఎవరంటే.. ఆ లిస్టులో సన్యా మల్హోత్రా ఖచ్చితంగా ఉంటారు. ఇక ఆమెకున్న టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. తన అద్భుతమైన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణిగా ప్రస్తుతం చలామణీ అవుతోంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం `దంగల్`తో సన్య కెరీర్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో సన్య రెజ్లర్ పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అప్పటి నుండి బదాయి హో, కథల్, జవాన్ సహా విభిన్న చిత్రాలలో అద్భుత పాత్రల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు.
అసలు సినిమాకి సంబంధించి ఎలాంటి నేపథ్యం తనకి లేకపోయినప్పటికీ, సన్యా పరిశ్రమలో తనకంటూ ఒక పవర్‌హౌస్ పెర్ఫామర్‌గా స్థిర పడింది. వరుసగా అద్భుతమైన విజయాలతో తన ఉనికిని చాటుకుంది. ఈ క్రమంలోనే సన్య తన అభిమానులకు నిరంతర ఫోటోషూట్లతో వీనులవిందు చేస్తోంది. ఇప్పుడు కూడా తన స్థాయిని స్టైల్ కంటెంట్ ని ఎలివేట్ చేసే ఫోటోషూట్ తో అభిమానుల హృదయాల్లోకి ఈ భామ చొచ్చుకు పోవడానికి చాలా కృషి చేస్తోంది. దాంతో సన్య తాజా ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాన్య మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్ తో మెస్మరైజ్ చేయడం ఈ ఫోటో షూట్ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.
అవును, సానియా ఆల్ లెదర్ లుక్ తో తన పొడుగు కాళ్ల సౌందర్యాన్ని బయటకి చూపిస్తూ, ఇచ్చిన ఫోజ్ ఒకటి ఇంటర్నెట్లో సెగలు పుట్టిస్తోంది. సన్య ఈసారి సదరు ఫోటోషూట్ కోసం రకరకాల డిజైనర్ దుస్తులను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో బ్రౌన్ లెదర్ జాకెట్ లో సాన్య మరీ ప్రత్యేకంగా కనిపించింది. ఇక సాన్య థైస్ అందం గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ పూజ హెగ్డేని మించిపోయాయని చెప్పుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్ గెటప్.. సాన్య డిజైనర్ థండర్ షోస్ ఇలా రకరకాల కోణాల్లో ఈ ఫోటోషూట్ ప్రత్యేకంగా మారిందని చెప్పుకోవచ్చు. అందుకే కుర్రకారు ఈ ఫోటోని తేరిపారా చూసేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా దూసుకెళుతోంది.