దేవర సినిమా మరో 12 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై కనివిని ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న దేవర తొలి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. రిలీజ్ కు 12 రోజులు మాత్రమే టైం ఉండడంతో దేవర టీం అటు నార్త్ లో భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తుంది. ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రమోషన్ లో పాల్గొంటున్నారు.
అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక కావాలని దేవర సినిమాను కొందరు టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో అక్కడ అధికార పార్టీతో పాటు కూటమి ప్రభుత్వ అభిమానులు సైతం దేవర సినిమాను టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు అయితే ట్రైలర్ అసలు ఏ మాత్రం బాగోలేదని అంటున్నారు. మరికొందరు ఎన్టీఆర్ లుక్ బాగోలేదని అంటున్నారు.
కొందరు దేవర సినిమా కోసం ఇప్పటివరకు బయటకు వచ్చిన ఏ కంటెంట్ కూడా ఎవరిని మెప్పించడం లేదని కామెంట్లు పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే దేవరను కావాలనే టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌పై వ్యక్తిగతంగా ఉన్న కోపం నేపథ్యంలో సినిమాను టార్గెట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.