దీంతో, జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడంతో వైసీపీ నాయకులు జానీ మాస్టర్ ని, పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని విమర్శిస్తున్నారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ ని పార్టీకి దూరంగా ఉండాలంటూ అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ ప్రకటనలో.. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడమైనది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం
తీసుకొంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది అని జనసేన పార్టీ హెడ్, కానిక్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధి వేములపాటి అజయ కుమార్ లేఖను విడుదల చేసారు. అయితే జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఎప్పట్నుంచో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ తరపున బాగా ప్రచారం కూడా చేసాడు జానీ మాస్టర్. పవన్ కళ్యాణ్ కూడా జానీ మాస్టర్ పై అభినందనలు కురిపించారు. ముందు నుంచి జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించారు జానీ మాస్టర్...!