ఇలా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న సంచలన నిజాలు చూసి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక మహిళ కూడా ఇలా వేధింపులు ఎదుర్కొనే ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇండస్ట్రీలో ఇలా లైంగిక వేధింపులు పేరుకుపోయాయి అందరూ అనుకుంటూ ఉండగా.. తనకు మాత్రం ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు అంటూ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ చెప్పకు వచ్చింది.
ఇలా కేరళ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్టు సంచలనాలు సృష్టిస్తున్న వేళ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయి. నేను ఇండస్ట్రీలో సురక్షితంగానే ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం నా అదృష్టం. కానీ ఇది అందరికీ వర్తిస్తుంది అని మాత్రం నేను చెప్పలేను. వర్క్ ప్లేస్ లో అభద్రత ఉండవచ్చు.ఇప్పటికీ కొంతమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అంటూ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కామెంట్స్ చేసింది. కాగా ఈమె టాలీవుడ్ లో నాని హీరోగా నటించిన చర్చి మూవీలో నటించగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటినుంచి ఈమెను టాలీవుడ్ లో నాని హీరోయిన్ అని పిలవడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.