బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు అని చెప్పాలి. జానీ మాస్టర్ గత ఆరేళ్లుగా అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. తన వద్ద పనిచేసే ఆమె యద రాజా తథా ప్రజా అనే సినిమాలో హీరోయిన్ గా కూడా చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఫిల్మీ బీట్ తెలుగు ఎక్స్క్లూసివ్ వీరిద్దరి మధ్య ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ క్రమంలోనే హీరోయిన్గా మారిన తన అసిస్టెంట్ను జానీ మాస్టర్ స్వయంగా ఇంటర్వ్యూ చేశారు.
అయితే జానీ మాస్టర్ ముందు ఎంతో వినయంగా నిలబడిన అసిస్టెంట్ ఆయన అడిగిన ప్రశ్నలకు ఎంతో ప్రేమగా అభిమానంతో గౌరవంతో సమాధానాలు చెప్పారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా ఇంత మంచి రిలేషన్ ఉన్న వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయి? అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? అని ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే గత ఆరు నెలల నుంచి మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడే ఎందుకు ఫిర్యాదు చేసింది? అనే ప్రశ్నలు కూడా తెరమీదకి వస్తున్నాయి. అయితే ఇక ఈ వివాదం పై స్పందించిన జానీ మాస్టర్ ఎవరో కావాలని తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని.. అసోసియేషన్ లో ఉన్న గొడవల కారణంగా కొంతమంది కక్ష గట్టి ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరి ఏది నిజం అన్న విషయాన్ని పోలీసులు తేల్చనున్నారు.