జానీ మాస్టర్ భార్య ఇది తప్పు అని చెప్పకుండా.. తన భర్తను పెళ్లి చేసుకోమని బెదిరింపులకు పాల్పడిందని.. చివరికి వారి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదులు పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్స్ సృష్టిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు మంచివాడు అనుకున్నాం. కానీ జానీ మాస్టర్ ఇలాంటి వాడా అంటూ ఎంతో మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక జానీ మాస్టర్ కు సంబంధించి ఏ చిన్న విషయం తెర మీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే జానీ మాస్టర్ వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాన్ని గతంలోనే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది చెప్పేశాడు అంటూ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. గతంలో చాలాసార్లు జానీ మాస్టర్ ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో పాల్గొన్నాడు. సాధారణంగా జడ్జిలపై హైపర్ ఆది పంచులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు దీంతో స్టేజి మీదకి బ్యాట్ పట్టుకొని వచ్చిన ఆది.. ఈరోజు జానీ అని నాకన్నా పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడు. ఆయన ఆట అస్సలు ఆగదు. శేఖర్ మాస్టర్ అమాయకుడు ఇన్ డైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తాడు. కానీ జాని మాస్టర్ డైరెక్ట్ గాని పని కానిచ్చేస్తాడు. గణేష్ మాస్టర్ అప్పులు తీరిస్తే.. జానీ మాస్టర్ ఆకలి తీరుస్తాడు అంటూ హైపర్ ఆది వేసిన పంచులకి వీడియో వైరల్ గా మారగా.. ఇప్పుడు హైపర్ ఆది చెప్పిందే నిజమైంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.https://x.com/ysj_madhureddy/status/1835637054530552042?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1835637054530552042%7Ctwgr%5E37736e60321117da58e5c58ba88413c0db7a1a11%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F