ఇక తారక్ కెరియర్ లో సోలోగా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న మొదటి సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. ఈ మూవీ లో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ పాటలు విడుదలై యూట్యూబ్లో ఎంతలా సెన్సేషన్స్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దేవర మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెంట్ దాటుతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారి పోయింది. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టాల్సిందే. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్లోనే ఇక సినిమా విడుదలైన తర్వాత 300 కోట్లకు పైగా వసూలు సాధిస్తేనే ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ గా నిలుస్తుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా సక్సెస్ ని సాధించడం కష్టమవుతుంది అని చెప్పాలి. ఇక అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తే ప్రొడ్యూసర్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందరూ లాభాలు పొందెందుకు అవకాశం ఉంటుంది.