2017లో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత 2021లో విడిపోయింది. చైతు రెండవ పెళ్లి శోభితాతో సిద్ధమయ్యారు.నటిగా ప్రస్తుతం ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి సమంత ఆరోగ్యం పైన ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి అంతే కాకుండా సమంత కూడా తన ఆరోగ్య విషయం పైన కూడా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా సమంత తన చర్మ సంరక్షణ గురించి కొన్ని విషయాలను తెలియజేసింది.
ఈ మధ్యకాలంలో తన చర్మం బాగా మెరుస్తోందని గతంలో లాగా మేకప్ వేసుకోవాల్సిన పనిలేదని తెలిపింది.. తనకు అనారోగ్యం వచ్చినప్పుడు చర్మాన్ని పట్టించుకోవడానికి కొన్ని స్ట్రాంగ్ డ్రగ్స్ తీసుకోవలసి వచ్చింది అంటూ సమంత వెల్లడించింది. ఇలాంటివి తీసుకోవడం వల్ల తన చర్మం పైన చాలా ప్రభావం చూపించాయని.. అందుకే చాలామంది కూడా తన చర్మాన్ని చూసి దారుణంగా కామెంట్స్ చేసేవారిని సమంత వెల్లడించింది. అందుకే ఇప్పుడు చర్మాన్ని ఆరోగ్యంగా పునరుద్దించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు అంటూ వెల్లడించింది సమంత. ప్రస్తుతం తాను రెడ్ లైట్ థెరపీ వంటి వాటిని తీసుకుంటున్నానని ఫేషియల్ వంటివి చేయించుకుంటున్నానని ఇవి చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి చాలా ఉపయోగపడతాయి అంటూ సమంత తెలియజేసింది. అందుకే ఇలా హాస్పిటల్ బెడ్డు పైన కనిపిస్తున్నానంటు తెలిసింది సమంత.హాస్పిటల్ బెడ్ మీద సమంత నుచూసి అభిమానులు ఆందోళన చెందడంతో కేవలం ఫేస్ గ్లోకి అని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు.