వెంకటేష్ అనీల్ రావిపూడి ల కాంబినేషన్ లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఎక్స్ ఎక్స్ ఎక్స్’ మూవీ కూడ సంక్రాంతి రిలీజ్ ను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు ఈ రేస్ లోకి బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. బాలకృష్ణ బాబీల కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకుంటున్న భారీ యాక్షన్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈసినిమా ఈసంవత్సరం డిసెంబర్ రేస్ లో విడుదల అవుతుంది అని భావించారు.
అయితే డిసెంబర్ లో అనేక భారీ సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో బాలయ్యను ఆ రేస్ నుంచి తప్పించి సంక్రాంతి రేస్ లో దించుతున్నట్లు టాక్. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన టీజర్ కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈమూవీకి ‘వీరమాస్’ అన్న టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ‘అఖండ’ ‘వీరసింహా రెడ్డి’ ‘భగవంత్ కేసరి’ హ్యాట్రిక్ హిట్స్ తో మంచి స్పీడ్ మీద ఉన్న బాలయ్య వరసగా నాల్గవసారి కూడ హిట్ కొట్టాలని ఈమూవీ ద్వారా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
సంక్రాంతికి విడుదలకాబోతున్న ఈమూడు సినిమాలలో నటిస్తున్న సీనియర్ హీరోలు అందరూ 60 సంవత్సరములు పై పడిన వారే. అయితే వయసును లెక్క చేయకుండా తమ స్పీడ్ ను మరింత పెంచుతూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతూ వరసపెట్టి సినిమాలు చేయడమే కాకుండా భారీ పారితోషికాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. రాబోయే సంక్రాంతికి జరగబోయే ఈసీనియర్ హీరోల వార్ లో విజేత ఎవరు అన్న విషయమై ఇప్పటి నుండే అంచనాలు ప్రారంభం అయ్యాయి..