ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా బాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పైన మాట్లాడుతూ.. తెలుగులో చాలా చిత్రాలలో నటించి సక్సెస్ అయ్యాను.. అయితే నెమ్మదిగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు బాలీవుడ్ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని.. ఆఫర్ ఇస్తామని కొందరు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని వెల్లడించింది.. ముఖ్యంగా తనని 12 రోజులపాటు వాళ్లతో పడుకోమని అడిగారు.. అలా చేస్తే ఒక కారుతో పాటు, కొంతమేరకు డబ్బు, ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పడంతో ఈ విషయం విన్న తర్వాత.. తనకు చాలా అసహ్యంగా అనిపించిందని.. వాళ్లని ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెంటనే బయటికి వచ్చేసానని తెలియజేసింది గాయత్రి గుప్తా.
గాయత్రి గుప్తా తెలుగులో ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం-2, మిఠాయి, సీత ఆన్ ద రోడ్ అనే షార్ట్ ఫిలింలలో కూడా నటించింది. అలాగే బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలంటూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిన ఈమె పోరాటం ఫలించలేదు.ఈ పోరాటంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లి కూడా మరి పోరాటం చేసింది. తెలుగులో మొట్టమొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ అనే అంశాన్ని కూడా తెరమీదికి తీసుకురావడానికి తన వంతు కృషి చేసింది గాయత్రి గుప్తా. ఈమె తర్వాతే శ్రీరెడ్డి కూడా ఈ విషయం పైన పోరాటం చేసిందట.